ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

తలకొండపల్లి మండల కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు నైతిక విలువలు పెంపొందించడంలో గురువుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులైన ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేసి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.