హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్ 65 ఆరు వరుసల విస్తరణకు భూసేకరణ!

రిపోర్టర్: మహేష్ స్థలం: నల్గొండ

హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 65ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. నల్గొండ జిల్లా పరిధిలో పలు మండలాల్లోని 6.32 హెక్టార్ల భూమిని సేకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యంతరాలుంటే 21 రోజుల్లోగా ఆర్డీవోకు తెలపాలని అధికారులు సూచించారు. ఈ విస్తరణతో పండుగ సమయాల్లో రద్దీ తగ్గనుంది.