పాల్ఘర్ ఆసుపత్రిపై దాడి: శివసేన నేత అరెస్ట్, సస్పెన్షన్

రిపోర్టర్: గోపి స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో శివసేన సిటీ చీఫ్ రాహుల్ ఘరాత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు. వైద్యులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.