'డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి పరాకాష్ట': వైఎస్ జగన్‌పై లోకేష్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. రాధిక అనే మహిళను అడ్డం పెట్టుకుని, సాక్షి పత్రిక ద్వారా జగన్ తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. డీఎస్సీలో క్వాలిఫై కాని రామకృష్ణ అనే వ్యక్తి ఉద్యోగం రాలేదంటూ తప్పుడు కథనాలు సృష్టించారని, ఇది గొడ్డలి పార్టీ కుట్రలకు పరాకాష్ట అని లోకేష్ ధ్వజమెత్తారు.