ఏపీ ఇంటర్ పరీక్షా విధానంలో కీలక మార్పులు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ ఇంటర్మీడియట్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేలా పరీక్షా విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బట్టీ పద్ధతికి స్వస్తి పలికి, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వ పరాఖ్ మార్గదర్శకాలను అనుసరించి కొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో పది శాతం ప్రశ్నలను సృజనాత్మక మరియు వినూత్న పద్ధతిలో ఇవ్వనున్నారు.