యుద్ధ విన్యాసాల్ లో కే-9 వజ్ర శతఘ్ని అద్భుతమైన ఫైర్ పవర్ ప్రదర్శన

రిపోర్టర్: శివ స్థలం: Jaisalmer

రాజస్థాన్ లోని జైసల్మేర్ ఎర్రటి ఇసుక మేటల మధ్య భారత సైన్యానికి చెందిన వైట్ టైగర్ డివిజన్ నిర్వహించిన వజ్ర ప్రహార్ విన్యాసాల్ లో కే-9 వజ్ర స్వయం చోదక శతఘ్ని తన అసాధారణ అగ్ని శక్తిని ప్రదర్శించిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. శత్రువుల భరతం పట్టేందుకు వీలుగా అత్యంత వేగంగా కదిలి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ఈ యుద్ధ విన్యాసాల్ లో స్పష్టంగా ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.