ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కోల్పోయిన చేతన్ భట్

రిపోర్టర్: సతీష్ స్థలం: జపాన్

ఆసియా క్రీడల 2026 కరాటే పురుషుల కుమిటే 84 కేజీల విభాగంలో భారత అథ్లెట్ చేతన్ భట్ కాంస్య పతక పోరులో పరాజయం పాలయ్యారు. చైనీస్ తైపీకి చెందిన మెంగ్-యు చుంగ్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో స్కోరు సమం అయినప్పటికీ, సెన్షు నిబంధన ఆధారంగా ప్రత్యర్థికి పతకం దక్కింది. సెమీఫైనల్ లో జోర్డాన్ క్రీడాకారుడి చేతిలో ఓడిన చేతన్ భట్, కాంస్య పతక పోరులోనూ గెలవలేకపోయారు.