భక్తిపారవశ్యంతో పులకించిన పాల్వాయి వినాయక మండప వేదిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాల్వాయి

గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ గల్లీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠానంతరం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. చిత్రియాల అంజయ్య–పార్వతమ్మ, దుర్గాప్రసాద్–మల్లీశ్వరి దంపతులు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పురోహితులు నిమ్మగడ్డ సత్యనారాయణ మంత్రోచ్ఛారణల మధ్య పూజాదికాలు శాస్త్రోక్తంగా సాగాయి. మంగళ వాయిద్యాల హోరుతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.