విద్యార్థులకు భారీ ఊరట: రాజస్థాన్లో ఏడాదికి రెండుసార్లు పదో తరగతి పరీక్షలు
రిపోర్టర్: శివ
స్థలం: Jaipur
రాజస్థాన్లో రెండుసార్లు పదో తరగతి పరీక్షల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానాన్ని తీసుకువస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై పరీక్షల భారాన్ని తగ్గించడంతో పాటు మార్కులు మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి అదనపు అవకాశం లభిస్తుందని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.