డక్కిలి పోలింగ్ ముగియడంతో మూడు పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 45 బూత్లలో 67% ఓటింగ్ నమోదైంది. తెలుగుదేశం, వైకాపా, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీటీసీకి భారీ మెజార్టీ వస్తుందని టీడీపీ, ఓటర్ల తీర్పే తమ తీర్పు అని వైకాపా, అంబేద్కర్ వారసుల ఓట్లు తమకేనని బీఎస్పీ చెబుతున్నాయి. ఏడో తారీఖున వెలువడే ఫలితాల కోసం మూడు పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.