జనం కోసం బతకాలన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి: సర్వేపల్లిలో ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన నాయకులు ధనం కోసం కాకుండా జనం కోసం బతకాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో తాను గెలిచినా, ఓడినా శాశ్వత అభివృద్ధి పనులకు తెదేపా చిరునామాగా నిలిచిందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.