అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత రహస్యాన్ని బట్టబయలు చేసిన మేనకోడలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఆయన మేనకోడలు మేరీ ట్రంప్ సంచలన విషయాలు వెల్లడించారు. తన తండ్రి సోదరి మేరియాన్ ట్రంప్ గతంలో డొనాల్డ్ ట్రంప్ గురించి తనకు చెప్పిన కొన్ని కుటుంబ రహస్యాలను ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు. తాను ఎప్పుడూ వినకూడదని కోరుకున్న ఒక షాకింగ్ విషయాన్ని సిరియస్ ఎక్స్ఎం హోస్ట్ తో మాట్లాడిన సందర్భంగా మేరీ ట్రంప్ పంచుకున్నారు.