తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని తేల్చేసిన పీసీసీ చీఫ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. ఇప్పట్లో విస్తరణ ఉండదని, ఈ నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి విచక్షణాధికారమని కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ పర్యటనలో కేబినెట్ కూర్పుపై చర్చ జరగలేదని, కొండా సురేఖ వ్యవహారంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. దీంతో మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతానికి విస్తరణకు బ్రేకులు పడినట్లేనని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.