ఆసియా క్రీడల స్క్వాష్ మహిళల విభాగంలో కాంస్యం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

ఆసియా క్రీడల స్క్వాష్ మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో హోంగాంగ్ చేతిలో ఓటమి పాలైందని క్రీడా అధికారులు వెల్లడించారు. అనాహత్ సింగ్, తన్వి ఖన్నా, జోష్నా చిన్నప్ప హోరాహోరీగా తలపడినప్పటికీ పరాజయం తప్పలేదు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరిందని నిర్వాహకులు తెలిపారు. పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.