రైలులో భయంగా ఉందన్న యువతి: శ్రీకాకుళం జిల్లాలో పట్టాలపై శవమై తేలిన అసోం డ్యాన్సర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీకాకుళం

విశాఖలో నృత్య ప్రదర్శన ముగించుకుని అసోం వెళ్తున్న ఇరవయ్యేళ్ల యువతి హిమశ్రీ బోరో శ్రీకాకుళం జిల్లాలోని రైల్వే ట్రాక్ వద్ద శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి ప్రయాణ సమయంలో రైలులో మద్యం తాగుతున్న వారి వల్ల తనకు భయంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.