తెలంగాణ అసెంబ్లీలో నేడు పంచాయతీరాజ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి సీతక్క
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. నేడు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు శాసనమండలిలో స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం, ఎమ్మెల్సీల సస్పెన్షన్ అంశంపై వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.