అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువతులు మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో కారు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అతివేగమే ప్రమాగానికి కారణమని పోలీసులు తెలిపారు. అయితే తమ కుమార్తెలను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతుల తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.