భక్తిపరవశంలో మునిగితేలిన గంగిరెడ్ల కాలనీలో వినాయక అన్నసమారాధన

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గాజువాక పరిధిలోని 106వ వార్డు గంగిరెడ్ల కాలనీలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పరవాడ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సాయంత్రం ఏడు గంటలకు ఇళ్ల వద్ద ఆశీర్వాద దీపం వెలిగించి ఆయన ఆయురారోగ్యాలను కోరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తురుశాల నరసింగరావు, రాఘవాపురపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.