యువత కేరింతలతో కళకళలాడిన కామదేను కళాశాల ప్రాంగణం
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కామదేను జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ లింబాద్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.