రాజకీయ లబ్ధి కోసమే విపక్షాల అసత్య ప్రచారం: బండి సంజయ్ కుమార్ ధ్వజం

రిపోర్టర్: అశోక్ స్థలం: కరీంనగర్

ప్రజల చేతిలో పూర్తిగా తిరస్కరణకు గురైన కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర విపక్షాలు అబద్ధాలు, అల్లర్ల ద్వారా అధికార మార్పిడికి కుట్ర పన్నుతున్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. దేశ రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు ఓట్ల చోరీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ అరాచకానికి తెరలేపుతున్నాయని విమర్శించారు. దేశాన్ని అస్థిరపరిచే ఇలాంటి కుటిల ప్రయత్నాలను భారత ప్రజలు తిప్పికొడతారని ఆయన స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.