గాంధీ జయంతి ఏర్పాట్లపై బాపూఘాట్లో కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలన
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
అక్టోబర్ రెండవ తేదీన నిర్వహించనున్న గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ మరియు బాపూ మ్యూజియం హాల్లో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.