దులీప్ ట్రోఫీ ఫైనల్: ఇషాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ
రిపోర్టర్: గోపి
స్థలం: తమిళనాడు
చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కిషన్ భారీగా 270 పరుగులు సాధించి ట్రిపుల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. కుశాగ్ర శతకంతో రాణించడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించింది.