తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఒక రకంగా, కేంద్రంలో మరొక రకంగా ద్వంద్వ విధానాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఢిల్లీలో భావప్రకటన స్వేచ్ఛను అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో మాత్రం బీజేపీ నిరసనలపై నిర్బంధాలు విధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని నిలదీశారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.