తెలుగు చిత్ర పరిశ్రమపై నటుడు షిరాజ్ మెహదీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న కష్టాలపై నటుడు షిరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద సినిమాలకే ప్రాధాన్యతనిస్తూ, చిన్న చిత్రాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇండస్ట్రీ పెద్దలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఫిలిం ఛాంబర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న నిర్మాతలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.