కరెంట్ కోతలపై రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పూర్తిగా దెబ్బతిన్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే కరెంట్ పోయిందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఎక్కడ చూసినా సబ్స్టేషన్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.