తీవ్రవాయుగుండం ప్రభావంతో విశాఖలో తీరం కోతకు గురికావడంతో ప్రజల అవస్థలు

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

తీవ్రవాయుగుండం ప్రభావంతో విశాఖపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఆర్కే బీచ్ రోడ్డులో తీరం భారీగా కోతకు గురైంది. ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాతయ్యపాలెంలో నీరు నిలిచిపోవడంతో జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సిరిపురంలో ఏయూ ప్రహారీ గోడ కూలిపోయింది. ప్రతి వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.