కార్మిక హక్కుల సాధనకు రాజాపేటలో సమరశంఖం పూరించిన ఏఐటీయూసీ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుర్ల లింగం జెండా ఎగురవేశారు. కమ్యూనిస్టులు ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత ఏఐటీయూసీకి దక్కుతుందని నాయకులు కొనియాడారు.