బడిలో స్వయంగా గణితం బోధించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన కలెక్టర్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉపాధ్యాయుడిగా మారారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పదవ తరగతి విద్యార్థులకు స్వయంగా గణిత పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు.