పోలీస్ స్టేషన్ వద్దే దాడి యత్నం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లపై మాస్కులు ధరించిన వ్యక్తులు దాడికియత్నించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించిన ఆయన, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.