స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పెంపు పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువును పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల గడువు ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో పిటిషన్ నిరర్థకంగా మారిందని న్యాయస్థానం పేర్కొంది. జిల్లా కేంద్రాల్లో నామినేషన్ల దాఖలు అంశంపై తదుపరి విచారణను వాయిదా వేశారు.