మొబైల్ వినియోగదారులకు షాక్, త్వరలో పెరగనున్న రీఛార్జ్ ధరలు

రిపోర్టర్: నరేష్ స్థలం: భారతదేశం

దేశంలో మొబైల్ రీఛార్జ్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ప్రతి వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు టెలికం కంపెనీలు టారిఫ్ ఛార్జీలను 10 నుండి 20 శాతం వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం, ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 5G సేవల విస్తరణ పేరిట కంపెనీలు మరోసారి భారాలు మోపుతున్నాయి.