తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అద్వైత్ కుమార్ సింగ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలను ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం అధికారికంగా స్వీకరించినట్లు తెలంగాణ సమాచార కేంద్రం పౌర సంబంధాల అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కోఆర్డినేషన్ ప్రత్యేక కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆయనకు, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.1441 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.