మాలేమార్పూరంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మందా సుధామణి విస్తృత ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని మాలేమార్పూరం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మందా సుధామణి గురువారం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయనపల్లి హరిజనవాడ, పొల్లోపల్లి యాదవుల వీధి, ఎస్టీ కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వారు ఓటర్లను కోరారు.