పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో భారీగా పాల్గొనాలని ఎస్పీ పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సూర్యాపేట
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల ఇరవై ఒకటో తేదీన నిర్వహించనున్న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించే వివిధ పోటీల్లో విద్యార్థులు, యువత, పౌరులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎస్పీ సూర్యాపేట పేర్కొన్నారు. ఈ వేడుకల ద్వారా అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములు కావాలని ఎస్పీ సూర్యాపేట విజ్ఞప్తి చేస్తూ తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.