ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను పరామర్శించిన కేటీఆర్
రిపోర్టర్: అశోక్
స్థలం: Secunderabad
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.