జవహర్ నగర్ డంప్ యార్డు తరలింపునకు ఈటల రాజేందర్ పాదయాత్ర

రిపోర్టర్: కృష్ణ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

జవహర్ నగర్ డంప్ యార్డును పూర్తిగా తరలించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాగిస్తున్న మీథేన్ గ్యాస్ కాలుష్యంలో ఈ యార్డు ప్రపంచంలోనే నాల్గో స్థానంలో నిలవడం అత్యంత ఆందోళనకరమని ఆయన మండిపడ్డారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఈ ప్రజా పోరాటాన్ని చేపట్టినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.