హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్ ఇళ్ల అమ్మకాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి కేవలం 26,068 మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాలు తగ్గినప్పటికీ బిల్డర్లు ధరలు తగ్గించకపోగా, సగటు ధర రూ. 2.03 కోట్లకు చేరింది. ఎన్‌ఆర్‌ఐ కొనుగోళ్లు తగ్గడం, కొత్త ప్రాజెక్ట్‌లతో అమ్ముడుపోని ఇళ్లు 1.42 లక్షలకు చేరాయి.