ఘాజియాబాద్ లో భారీ పేలుడు కలకలం: ఏటీఎస్ రంగ ప్రవేశంతో తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: గోపి
స్థలం: Ghaziabad
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజియాబాద్ పరిధిలోని వాసుంధర పోలీసు అవుట్ పోస్ట్ వెలుపల జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగి తీవ్ర దర్యాప్తు చేపట్టిందని ఏటీఎస్ డీఐజీ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. ధనత్రయోదశి ముందు రోజు రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసు అవుట్ పోస్ట్ ధ్వంసమైందని, ఒక ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కు స్వల్ప గాయాలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.