కొండపల్లిలో ఘన ప్రారంభం: రూ.1.61 కోట్లతో గిరిజన గ్రామానికి మెరుగైన తారురోడ్డు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జీ.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్రెల పంచాయతీ కొండపల్లి గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద రూ.1.61 కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డును కూటమి నాయకులు బుధవారం ప్రారంభించారు. జనసేన మండల ప్రధాన కార్యదర్శి పొత్తూరు విష్ణుమూర్తి, పంచాయతీ అధ్యక్షులు చిక్కుడు అశోక్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.