జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారిని ఎంపిక

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన విద్యార్థిని ఎస్. జాజిలి మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీలో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 2 నుంచి 4 వరకు జరిగే ఈ పోటీల్లో ఆమె పాల్గొంటున్నట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారినిని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు ప్రత్యేకంగా అభినందిస్తూ జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.