సిరిసిల్లలో కాంగ్రెస్ దండయాత్రపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

తెలంగాణ ప్రజల భూములను దోచుకున్న భూబకాసురుల భరతం పడతామని, అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తామని Telangana Congress స్పష్టం చేసింది. సిరిసిల్ల మరియు సిద్దిపేటలో బీఆర్ఎస్ నేతలతో తేల్చుకుంటామని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలిపింది. ఫాంహౌస్ దొరల గుండెల్లో వణుకు పుట్టించేలా రేపు కాంగ్రెస్ శ్రేణులు సిరిసిల్లకు దండయాత్రగా వెళ్లనున్నాయని వెల్లడించింది. బానిసలు, చెంచాలతో ఎవరు వస్తారో రండంటూ సవాల్ విసిరింది.