తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను విస్మరిస్తున్న పాలకుల తీరు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక జాతా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన చారిత్రక పోరాటాన్ని మతోన్మాద పార్టీలు వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.