నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ సజ్జనార్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగియడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకరంగా ప్రవర్తించే వారిని సోషల్ మీడియా దృశ్యాల ఆధారంగా గుర్తించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు. వేడుకలు పూర్తిగా ముగిసిన వెంటనే తప్పు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు.