కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర మండిపాటు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఖర్గే వ్యాఖ్యలు భాషా మర్యాదను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది ఆ పార్టీ అసలు సంస్కృతికి అద్దం పడుతోందని ఆక్షేపించారు. సభలో సామాన్యుడు ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దిగజారుడు ధోరణులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వెల్లడించారు.