అగ్నివీరులకు భారీ ఊరట: సేవా కాలాన్ని మరో రెండేళ్లు పొడిగింపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరుల సేవా కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు. నాలుగేళ్ల ప్రాథమిక పదవీ కాలం ముగిసిన తర్వాత బయటకు వెళ్లాల్సిన డెబ్బై ఐదు శాతం మంది అగ్నివీర్లకు అదనంగా మరో రెండేళ్లపాటు సేవలు అందించే అవకాశం కల్పిస్తామని ఆయన బుధవారం స్పష్టం చేశారు. ఈ అదనపు గడువు పూర్తయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు సాయుధ దళాల్ లో శాశ్వతంగా చేరవచ్చని వెల్లడించారు.