కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్లో గాయపడిన అమితాబ్ బచ్చన్

రిపోర్టర్: నరేష్ స్థలం: Mumbai

కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మోకాలికి గాయమైనట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. తాజా ఎపిసోడ్ ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ, నిలబడి మాట్లాడటంలో ఇబ్బంది ఉండటంతో కుర్చీలో కూర్చునే మోనోలాగ్ పూర్తి చేశానని తెలిపారు. స్టూడియోలో ఉన్న ప్రేక్షకులు ఆందోళన చెందవద్దని, గాయం తీవ్రమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.