తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదన్న హైకోర్టు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
తండ్రి జీవించి ఉన్నంతకాలం ఆయన ఆస్తిలో చట్టబద్ధంగా వాటా కోరలేరని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చాక పాత విధానం వర్తించదని పేర్కొంది. పూర్వీకుల ఆస్తి విషయంలోనూ తండ్రి మరణం తర్వాతే వారసులకు హక్కులు సంక్రమిస్తాయని స్పష్టం చేస్తూ సంబంధిత పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.