నటుడు సౌరవ్ గుర్జర్‌పై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

నటుడు మరియు రెజ్లర్ అయిన సౌరవ్ గుర్జర్‌పై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ మరియు వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పేర్కొంటూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఆగస్టు 15న పోలీసులను ఆశ్రయించింది. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరు, ఆ తర్వాత సన్నిహితంగా మెలిగినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లి గురించి ప్రశ్నిస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధించాడని, పరారీలో ఉన్న నిందితుడిని ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.