జొమాటో ఆర్డర్‌లో బీడీ: షాక్ తిన్న బెంగళూరు కస్టమర్
రిపోర్టర్: మహేష్
స్థలం: బెంగళూరు
బెంగళూరులో జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన పావ్ బాజీలో బీడీ ప్రత్యక్షమైంది. ఉల్లిపాయల ప్యాకెట్‌లో కాలిన బీడీని చూసి ప్రియం తహబిల్డర్ అనే కస్టమర్ షాక్ అయ్యారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన జొమాటో, బాధితుడికి కేవలం 100 రూపాయల కూపన్ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.