హోమియోపతి వైద్య రంగానికి డాక్టర్ మోహన్ లాల్ సేవలు అభినందనీయం :డా శివ ప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సికింద్రాబాద్
రామంతాపూర్లోని డీకే ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో నిర్వహించిన డాక్టర్ టీ మోహన్ లాల్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఆయన చూపిన నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని, పదవీ విరమణ అనంతరం కూడా యువ వైద్యులకు తన అనుభవాన్ని అందించాలని శివ ప్రసాద్ ఆకాంక్షించారు.